poems on mother in telugu , Collection of mother poems in telugu, కనిపించని దేవుడైనా.. కని పెంచిన నీ తర్వాతే అమ్మా!

కనిపించని దైవం కన్నా కనిపించే అమ్మ మిన్న
సిరిసంపదలు ఎన్ని ఉన్నా
అమ్మని ప్రేమించని జీవితం సున్నా

ఆకలి వేస్తే అమ్మ అలసిపోతే అమ్మ
భయం వేస్తే అమ్మ బాధ కలిగితే అమ్మ
ఇలా ప్రతిచోటా అమ్మే ప్రతి పనిలోనూ అమ్మే
అందుకే నా మనసంతా అమ్మే..

అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది
అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది

ఎలా ఉన్నా ఎక్కడ ఉన్న అమ్మ అమ్మే కదా
అమ్మతనానికి రూపాలు ఉండవు అమ్మ నోటికి శాపాలు ఉండవు
మనసున్నది అమ్మ
మంచి కోరేది అమ్మ


నిజం చెప్పాలంటే.. 
ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవరికి రాదు..!!
ఒక్క అమ్మకు తప్ప

“తల్లి” ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఆ స్థానాన్ని ఇతరులెవ్వరూ భర్తీ చేయలేరు.

అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు కాని చెప్పాలన్న ఆశ ఆగడం లేదు నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది.

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ
నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం
తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే.

Also Read
Mothers day quotes in telugu
Mothers day wishes in telugu
friendship quotations in telugu

Write A Comment