Collection of manchi Matalu in Telugu. నేటి మంచి మాట, మంచి సూక్తులు, దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.

Manchi Matalu in Telugu

జీవితంలో వెనక్కి రానివి
చేజార్చుకున్న అవకాశం
పెరిగే వయస్సు
గడిచిపోయిన కాలం
నోటి నుండి వెలువడిన మాట

ప్రపంచంలో ఏదైనా చవకగా దొరకవచ్చు  కానీ…
మనశ్శాంతి, ఆనందం మాత్రం వెలకట్టలేనివి

 రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే
ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న
ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

పుస్తకాలను నమ్మితే
పాఠాలు నేర్పుతాయి 
మనుషులను నమ్మితే
గుణ పాఠాలు నేర్పుతారు

రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు
అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది
మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది
ఇతరుల చెవున పడ్డాక హస్యంగా మారుతుంది జాగ్రత్త

ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు
ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు
అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు

లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం
అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి
అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 సంతోషం అనేది డబ్బు లోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు.


మంచి మాటలు

 తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి అవుతుంది.

 జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ నాయకుడు అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు.

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 ఒకరినుంచి ఆశించటం లేదా ఒకరి గురించి ఆలోచించడం ఏనాడైతే మానేస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది.

 నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది.

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి.

 కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యతలేని యవ్వనం అలంకరణ తో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు.

 ముళ్లబాట దాటితేనే పూల బాట ఎదురవుతుంది అలాగే సవాళ్లను ఎదుర్కొటెనే విజయం ఎదురవుతుంది.

 ఒదిగి ఉండటం అంటే ఓడిపోయినట్లు కాదు అది వ్యక్తిత్వానికి నిదర్శనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఉండగలగాలి.

 సరి కాని దారిలో పెద్ద గుంపు తో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది.

మనసును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్లే.


మంచి సూక్తులు

 సమయం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పక పోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండకపోవచ్చు కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు.

ఆపదలో ఉన్న వారికి చేసిన సహాయం ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధా పోదు.

 తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది ఆరిపోయిన దీపానికి ఆర్పి వేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంది.

 ఏ స్నేహం చివరిదాకా ప్రయాణం చేస్తుందో లేదో తెలియదు కానీ ప్రతిరోజు పలుకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది.

 అందంగా మాట్లాడటం ఒక కళ అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకో గొప్ప కళ.

 నీడనిచ్చిన చెట్టునీ  అన్నం పెట్టిన చేతిని మరిచిపోకూడదు.

 డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు.

 వంద సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు.

 డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడుకుంటే మీ జీవితంతోనే ఆడుకుంటుంది.

 అలలు తగాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ

 బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు మొదటి వాడు ఎప్పటికీ స్నానం చేయలేదు రెండో వాడికి ఎప్పటికి జ్ఞానం రాలేదు.


నేటి మంచి మాట

 ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు ముందు నువ్వు మారడం ముఖ్యం.

 నీ బలహీనతలు నీ శత్రువు ఎత్తిచూపిన అంగీకరించు అప్పుడే నువ్వు మరింత బలవంతుడిగా మారుతావు.

 సంకల్పబలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు.

 మనకు ఉన్న దాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేనిదాని కోసం ఆరాట పడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము.

 నాలుగు విషయాలకు సిగ్గు పడకండి
పాత బట్టలు
పేద స్నేహితులు
ముసలి అమ్మానాన్న
సాధారణ జీవనం

 జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి ఒక్కోసారి మనం ఏడ్చిన రోజులు గుర్తు వచ్చిన మరో సారి మనం నవ్విన రోజులు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాం.

 నీ జీవితాన్ని గొప్పగా మార్చేవాడు నీ ముందు అద్దం లో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు

 దొరికిన దానితో సంతృప్తి పడే వాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడే వాడు ఎప్పటికీ బాగుపడడు

 లో నీ కండల్లో బలం ఉంటే సిపాయి గా మిగిలిపోతావు అదే నీ ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలు తావు.

 ఓపిక ఎంతో నేర్పిస్తుంది ఓటమిని ఒంటరితనాన్ని గెలిచేలా ఓదార్పునిస్తుంది.

 అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశాంతికి హానికరం అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది.

 ఉన్నదానితో సంతోషపడే వారు కొందరు లేనిదాని కోసం బాధపడుతూ ఉన్న సంతోషాన్ని కోల్పోయే వారు మరికొందరు.

 ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది.

 బాధ బలం రెండు నీ లోనే ఉంటాయి విచిత్రమేమిటంటే ఏది ముందు వచ్చిన రెండోది కనబడకుండా పోతుంది.

 అర్థ జ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగు ముందుకు వెయ్యకండి.

 నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వు కానీ ఒకరి కన్నీళ్లకు కారణం అవ్వకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది.

 జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ రెండు సూత్రాలు పాటించండి
క్షమించలేని వారిని మర్చిపోవాలి
మర్చిపోలేని వారిని క్షమించేయాలి

 ఆశతో ఉన్న వారికి గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నవారికి కేవలం ప్రయాణం ఉంటుంది.

 నీకోసం నువ్వు బతకడం లో ఏముంది గొప్పతనం నిన్ను నమ్మిన వాళ్ళకోసం బాధ్యతతో బ్రతుకుతావ చూడు అందులో ఉంది అసలైన ఆనందం అసలైన గొప్పతనం.

పట్టుకున్న దాన్ని విడిచి పెట్టకు
విడిచి పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకు
అది ఆశయమైన బంధమైనా

నీవు ఎంత చదివావు అన్నదీ నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది
నీవు ఎంత ఎదిగావు అన్నది ప్రవర్తనలో ఉంటుంది

నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకుండా పర్వాలేదు కానీ
పక్కవాడి పని చెడగొట్టాలనే చెత్త బుద్ధి మాత్రం ఉండకూడదు.

 నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది.

 ఆత్మ అభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరు ఏమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు.

 పిల్లల కోసం ఆస్తులు పెంచకండి పిల్లల అనే ఆస్తులుగా పెంచండి.

 నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు.

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 నీకు బలం లేదు అనుకోవడమే నిజమైన బలహీనత.

 హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది.

 ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడు సంతృప్తిగా ఉండాలనే కోరిక విలువైనది.

 సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు.

 జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఎదుటి వారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు.

 మనిషి నోటిని రెండుచోట్లా అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినే చోట ఇంకొకటి మాట్లాడే చోట ఒక్కటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరొకటి బంధాల్ని కాపాడుతుంది.

 ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నల్లో పద్ధతి ఉంటే వచ్చే సమాధానం లో సంస్కారం ఉంటుంది.

Telugu Manchi Matalu
Telugu Manchi Matalu

 ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనస్సు ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

 కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్ధించటం మిన్న.

 జీవితం అంటే ఆట కాదు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడానికి జీవితమంటే యుద్ధం గెలిచే వరకు పోరాడాల్సిందే.

Write A Comment