Sarvepally Radhakrishnan Quotations in telugu.డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు

భారతీయుల సమున్నత ప్రతిభను విశ్వమంతటికీ చాటిన, భారత సీమ తాత్విక వేదాంత పరిమళాలను ప్రపంచమంతటికీ పంచిన కల్పతరువు సర్వేపల్లి. విద్యావేత్తగా, ఆచార్యుడుగా, మేధావిగా, తత్త్వవేత్తగా, రాజనీతిజ్ఞుడుగా, పరిపాలనా దక్షుడుగా స్వదేశంలోనే కాక అన్ని దేశాలలో ప్రశంసలందుకున్న మనీషి రాధాకృష్ణన్. * సామాన్యుడుగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడుగా ఎదిగిన ఆయన భారతదేశ ప్రముఖులలో ఒకరు.

రాధాకృష్ణన్ చిత్తూరు జిల్లాలోని తిరుత్తనిలో 1888 సెప్టెంబరు 5న జన్మించారు. తిరుత్తనిలో హైస్కూలు విద్యను, నెల్లూరులో ఎఫ్.ఏ. దాకా చదివి మద్రాసుకు చేరుకుని అక్కడి క్రైస్తవ కళాశాలలో చేరి తత్త్వశాస్త్రంలో ఎం.ఏ. పట్టం పొందారు.


Sarvepally Radhakrishnan Quotes in Telugu

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

చదువుకు  క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది.

 ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.

నీ ప్రవర్తన పది మందికి మార్గాదర్సాకంగా ఉండాలి. పదిమంది విమర్శించ కుండా మసలుకో.

జీవితంలో కోట్లకు కోట్లు సంపదిన్చినపుడు కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందగలిగినపుడు కలుగుతుంది.

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

గొప్పదనం బలంలో లేదు , ఆ బలాన్ని వాడుకోవడంలో ఉంది.


Sarvepally Radhakrishnan Quotations in Telugu

మంచిని భోదించే మహనీయులు మండుతున్న కాగడాల వంటి వారు. తాము కాలిపోతు ఇతరులకు వెలుగునందిస్తారు. 

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

 కాంతి ఏ దీపం నుంచి వచ్చినా మంచిదే , గులాబి ఏ తోటలో విరిసిన అందంగా ఉంటుంది.

మెదడుకు  శిక్షణ ఇస్తే చాలదు, హృదయాన్ని  సున్నితం చేయాలి, ఆత్మకు క్రమశిక్షణ ఇవ్వాలి, అప్పుడే అది సమగ్ర విద్య అవుతుంది.

  గ్రంథాలయాల ద్వారా  సాహిత్యం నుంచి జీవితంలోకి ప్రవేశిస్తాము.


సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.

మనం ఎందుకు జన్మించామో తెలుసుకోకుండానే మనలో చాలా మంది ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతుంటారు.  
 

 చెడును అడ్డుకోవడం బాధ్యత కాదు, అదో హక్కు.

ఉన్నదానితో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం చాలని భావించడం అజ్ఞానం.

కలలు వాస్తవాలు అయితే, వాస్తవాలనే కలలుగా భావించుకో.

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

మనం ముందుకు సాగుతున్నాము, అయితే లక్ష్యం ఇంకా దూరంలోనే వున్నది.

విజయం మనిషిలో  పగ అనే ఆరని అగ్నిని రాజేస్తే , ఆ తర్వాత అది విజేత దుఃఖానికి కారణం అవుతుంది.

Sarvepally Radhakrishnan Quotes in Telugu , Teachers Day Quotes

నిజమైన సత్యాన్ని నమ్మేవాడు అణుకువతో వుంటాడు.


Also Read
Buddha Quotations in Telugu | బుద్ధుని సూక్తులు తెలుసుకోండి
Swardham Telugu Quotes| Selfish Quotes in Telugu
Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్

Write A Comment