భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా , నా ఆలోచనలను తెలియజేయడానికి నేను ఇక్కడకి వచ్చాను. మన స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దాన్ని రక్షించుకోవడానికి అత్యున్నత త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నాం.
ఆగష్టు 15, 1947 న , భారతదేశం సార్వభౌమ దేశంగా తన హోదాను సాధించింది, ఇది మన పూర్వీకుల త్యాగం ద్వారా సాధ్యమైంది. ప్రతి సంవత్సరం, ఈ తేదీన, భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొందిన రోజుని గౌరవించటానికి మనము స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.
ఈ గొప్ప ఘట్టాన్ని గుర్తుచేసికునేందుకు, ఇక్కడ ఉన్న మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ రోజు కేవలం ఆనందం మరియు ఉత్సవాల కంటే మనం గుర్తించాల్సింది, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకునే మరియు గౌరవించే రోజు.
బ్రిటిష్ వారు మొదట్లో వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు, కానీ అది భారతదేశ బానిసత్వానికి దారితీసింది. మన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా నిరసనలు మరియు తిరుగుబాట్లను చేశారు, చివరికి అది మన దేశ విముక్తికి దారి చూపింది .
స్వాతంత్య్ర దినోత్సవం అనేది భారతదేశ స్వేచ్ఛకు మార్గం సుగమం చేసిన రోజు. మరొకసారి మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, జైహింద్.


Also Read
Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్
Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

Write A Comment