Collection of Aristotle Quotes in Telugu, అరిస్టాటిల్ సూక్తులు.

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.

Aristotle Quotes in Telugu

Aristotle Quotes in Telugu

అర్థం చేసుకున్నది వివరించాలి, తెలుసుకున్నది చేయాలి.

Aristotle Quotes in Telugu

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురి అవుతూ ఉంటారు.

విప్లవాలు,నేరాలనేవి పేదరికం నుంచే పుట్టుకొచ్చాయి. మానవుడు సంఘజీవి.

ఆశ అనేది నడుస్తున్న కల వంటిది.

Aristotle Quotes in Telugu

స్నేహమనేది రెండు దేహాలలో ఉండే ఒక ఆత్మ.

అన్ని రకాల అల్లర్లకు, అపరాధాలకు మూలకారణం దారిద్ర్యమే.


అరిస్టాటిల్ సూక్తులు

కోపం రావడం మానవ సహజం, ఐతే దాన్ని ఎప్పుడు,ఎక్కడ,ఎవరి మీద ప్రదర్శించాలో  తెలుసుకోవడమే విజ్ఞత.

ఒక దేశంలో అనేక స్వభావాలు గల ప్రజలు నివసిస్తున్నారు. వీరినందరిని ఒకటిగా చేర్చేందుకు విద్యావిధానం అనేదే అవసరమైన సాధనం. దీనిని వదిలి చట్టం మూలంగానో, సంస్క్రతి,సంప్రదాయాల మూలంగానో ఒక్కటిగా చేర్చడం తెలివి తక్కువతనం.

నేర్చుకన్నవాడికి,  నేర్చుకోలేని వాడికి మధ్య ప్రాణమున్న వాటికి, ప్రాణం లేనివాటికి మధ్య గల తేడా గలదు.

సమాజంలో మంచివాడిగా మారిన మానవుడు అన్ని ప్రాణుల కంటే  గొప్పవాడు, అతడే చట్టాన్ని, నీతిని వదిలి పెట్టి జీవిస్తే అతని కంటే  భయంకరమైంది ఏది లేదు.

ఒక నగరం మంచి చట్టాలతో పరిపాలించబడే కంటే , ఒక మంచి వ్యక్తిచే పరిపాలింపబడుట గొప్పదగును.

అందం దేవుడిచ్చిన వరం.

ఆశ ఓ పగటి కల.
ఆశ మేలుకొంటున్న  స్వప్నం.

ప్రజలు ఎవరిని చూసి భయపడతారో వారిని ప్రేమించలేరు.

Aristotle Quotes in Telugu

గొప్ప రాజకీయ సామాజికవర్గం మధ్య తరగతి నుండే ఉద్భవిస్తుంది.

Aristotle Quotes in Telugu

జీతం తీసుకొని పని చేసే వారి మెదళ్లు హీనమై నశిస్తాయి.

యువకులు స్తిరంగా మత్తెక్కించే ఓ స్థితిలో వుంటారు. ఎందుకంటే యవ్వనం మధురమైనది.

వైద్యుడు తగ్గిస్తాడు,ప్రకృతి మాములుగా నయం చేస్తుంది.

సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది.

Aristotle Quotes in Telugu

మానవుడు ఆలోచించే జంతువు.

ప్రజల భాషలో మాట్లాడాలి. మేధావులలా ఆలోచించాలి.

కళ అంటే వస్తువు రూపం కాదు. ఆ రూపం అంతర్గత స్వభావం.

సరైన సమయంలో సరైన కారణంతో సరైన విధానంలో కోప్పడటం సులభం కాదు.

నీ గొప్పతనం నువ్వు పొందిన బిరుదుల్లో లేదు. దానికి నీకున్న అర్హతలో వుంది.

మనిషి ప్రకృతి సిద్ధంగా రాజకీయ మృగం.

పని ముగించడమంటే తీరిక మొదలు కావడమే.

ప్రజలు నగరాలకు ప్రేమగా వస్తారు. వాళ్ళు మంచి జీవనం కోసం కలిసే వుంటారు.

నేను ప్రజలను అనుసరిస్తాను, నేను వారికి నాయకుణ్ణి కాను.

జీవిత సగాభాగంలో బద్ధకస్తులకు,బలమైన వారికి పెద్దగా తేడా  లేదు. ఎందుకంటే నిద్రావస్థలో తేడాలేదు కనుక.

సాధువు మెదడులోనైనా ఏదో ఒక మూల మూర్ఖ లక్షణాలుంటాయి.

ఎంతో కొంత పిచ్చిలేని పరిశుద్ధాత్మ లేదు.

విప్లవానికి, మోసానికి పేదరికమే మాతృక.

ఎంతో కొంత పిచ్చిలేని ప్రజ్ఞావంతుడు వుండడు.

ఓ వర్గానికి భోగముగా భావించిన విద్య నేడు సమాజానికంతతికి అవసరమైనదిగా పరిణమించింది.

మానవాళిని పరిపాలించాలనే కళను పెంపొందించుకోవాలంటే  ఆ రాజ్యపు యువకులు విద్యపై ఆధారపడి వుందని నమ్ముతున్నారు.

విప్లవాలు వ్యర్ధంకాదు,కాని వ్యర్ధం నుండి జనించాయి.

విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యం అవుతాయి. 

చిన్న విషయాలతో కలవరం పుట్టి గొప్ప సమస్యలను పరిష్కరిస్తాయి.

శాసనమంటే  మంచి క్రమశిక్షణే .

శాసనానికి అభిమానంతో ముడిపడని కారణం కావాలి.

అసమాతల్లో భయంకరమైనది అసమాన వస్తువుల్ని సమాన వస్తువ్ల్ని చేయడం.

Aristotle Quotes in Telugu

అన్నింటిలోను మనం సమానులమే అనే భావనలను కల్గించడమే ప్రజాస్వామ్యం.

పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవడం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే  స్వేచ్ఛ పోగొట్టుకున్నానా అని భావిస్తాడు.

Also Read:
Love Quotes Telugu | ప్రేమ కోట్స్ 
Money Telugu Quotes | డబ్బు కోట్స్
Jiddu Krishnamurti Telugu Quotes | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ తెలుసుకోండి
Rabindranath Tagore Telugu Quotes | రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్స్

Write A Comment