Discover the best love quotes in Telugu that beautifully express emotions and feelings. Perfect for sharing with your loved ones and adding a spark to your conversations.

1.మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు కానీ, నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

Love Quoes in Telugu, Love Quotations in Telugu

2.ప్రేమించే హృదయానికి ఎల్లప్పుడూ యవ్వనమే.

3.ఒకేసారి,  ప్రేమించడం, తెలివిగా ఉండడం అసాధ్యం.

4.అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు.

5.ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగ బాధపడతారు.*

6.మనిషి సంతోషం అతను ప్రేమించే స్వభావం మీద ఆధారపడి వుంటుంది 

Love Quotes In Telugu Images

Love Quoes in Telugu, Love Quotations in Telugu

7.కళ్లకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము.*

8.బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు. మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం…

9.మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు….కన్నీళ్లు మాత్రమే వస్తాయి

10.కొంతమంది మనకు ప్రపంచం అవుతారు కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు లేదు

11.గుండె మాత్రం నాదే…!
కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే

12.మనుషులు దూరమైనత తొందరగా జ్ఞాపకాలు దూరం కాలేవు.

Love Quoes in Telugu, Love Quotations in Telugu

13.నీతో మాట్లాడకుండా ఎంతసేపు ఉంటాను తెలియదు కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను

14.కేవలం ప్రేమ అనే అనుకున్నా కానీ దూరం పెరిగాక కానీ అర్థం కాలేదు ప్రాణమని*

Heart Touching Love Quotes In Telugu

15.దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ.

16.మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది మనుషులు వదిలేయడంలో వింతేముంది?

17.ప్రాణంగా ప్రేమిస్తే మరణం వరకు మరువలేము

Love Quoes in Telugu, Love Quotations in Telugu

18.నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంత మంది అయినా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం

19.ఊపిరి లాంటి తను దూరమయ్యాక మరో ఆయువు లాంటి కన్నీరు తోడైంది

20.మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం

21.అలలు లేని సముద్రం అయినా ఉంటుందేమో కానీ నాకు నువ్వు గుర్తుకురాని క్షణం మాత్రం ఉండదు

Love Quoes in Telugu, Love Quotations in Telugu

22.ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అద్భుతం నా అదృష్టం.

23. కావాలి అనుకున్నప్పుడు దొరకని ప్రేమ…

 వద్దు అనుకున్నాక వచ్చినా,

 దాని మనసు తీసుకోడానికి ఇష్టపడదు అంతే

24. నా మనసుకి మాటలు వస్తే, అది పలికే తొలిమాట, నువ్వంటే నాకిష్టమని.

Telugu Love Quotations

25. తన జీవితంలో తనకి నేను ఒక జ్ఞాపకం, కానీ తన జ్ఞాపకాలే నా జీవితం.*

26. ప్రేమికులకు అసలు ప్రపంచంతో పనిలేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.

27. ప్రేమను అక్షరాలతో వర్ణించినంతా తేలికగా నీ పై ఉన్న నా ప్రేమను వర్ణించలేను.

Love Quoes in Telugu, Love Quotations in Telugu

28.  నీకు నాకు మధ్య ఎంత దూరమైనా ఉండొచ్చు కానీ మన మనసుల మధ్య కాదు.

29. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతో మంది దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం.

30. పరిచయం అందరు అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు.

31. గాలి కెరటాల పైన నే తేలియాడుతూ రానా నీ గుండె గూటిలో నా శ్వాస నై ఒదిగిపోన.

32. నీ జ్ఞాపకాలే నా ప్రాణం నీ జ్ఞాపకాల తోనే నా ప్రయాణం.

Love Quoes in Telugu, Love Quotations in Telugu

33. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా కాదు.

34. నా హృదయం అనే కోవెలలో ప్రేమ అనే తాళం తెరిచి చూస్తే అందులో కొలువై ఉంది నీ రూపం.*\

35.మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి ఒక క్షణం చాలు ఆ ప్రేమను చూపించడానికి ఒక జీవితకాలమైన సరిపోదు.*

36.  దూరమయ్యే క్షణాలకు మాత్రం ఏమి తెలుసు దగ్గరుండే జ్ఞాపకాల విలువ.*

37.  మర్చిపోవడం రాదు ఇంకొకరికి మనసు ఇవ్వడం చేతకాదు.*

38. నా పేరు ఇంత అందంగా ఉంటుందని తెలీదు నువ్వు పిలిచే వరకు.

love messages in Telugu

Love Quoes in Telugu, Love Quotations in Telugu

39.నాతో నేను ఉన్నంత సేపు బాగానే ఉన్న నీతోటి ఉన్నప్పుడే ప్రేమలో పడిపోతున్న.

40.నీ జ్ఞాపకాలు నాకు తీరాన్ని తాకే అలల లాంటివి అవి ఎప్పటికి అగవు.

41.నటిస్తే కన్నులకు మాత్రమే నచ్చుతారు మనుస్సుకు కాదు.

42.జీవితం అంటే ఎవరికైనా జననం నుంచి మరణం మధ్య కాలం….కానీ నాకు మాత్రం నీతో గడిపిన సమయం..

43.ఇష్టం అయినా బంధం మర్చిపోటం కష్టం..!

44.నచ్చినదాన్ని వదిలేసుకోవడం చాలా కష్టం… అలాగే పట్టుకోవడం కూడా కష్టమే…

45.ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలంటే కూడా అదృష్టం వుండాలి

46.నీ ప్రేమ ఎదురవ్వడం ఒక వరం, నిన్ను గెలుచుకోవడం ఒక యుద్ధం.

47.మనసుకు నచ్చిన వాళ్ళతో ఒక్క క్షణం,కాదు ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది.

48.సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం..సమయం చేసుకొని మాట్లాడేది బంధం…*

49. తనపై నాకు ఉన్న ప్రేమ తను అర్ధం చేసుకోలేనంత నేను చెప్పుకోలేనంత.*

50.చెయ్యి పట్టుకుని ఎంత కాలం ఉంటావో తెలియదు కానీ నా  గుండెకు హద్దుకొని జీవితాంతం ఉంటావు.*

51.తన ఆలోచనల్లో నా చోటు ఖరీదు ఇసుక రేణువు అంత..

52.ప్రేమ అనే సాగరంలో ఉన్న ఒక చిన్న చేపను నేను, సాగరతీరాన ఆల్చిప్ప లో దాగి ఉన్న ముత్యం నా ప్రేమ

53.ప్రేమ అనేది ఓ అందమైన పుష్పం లాంటిది ఎప్పుడు రాలి పడుతుందో ఎవరికీ తెలియదు

54.ప్రేమించడానికి అమ్మాయి ఉంటే సరిపోతుంది కానీ ప్రేమించబడడానికి ఇంక చాలా కావాలి….

55.ప్రేమ అనేది ఓ అందమైన పుష్పం లాంటిది, ఎప్పుడు రాలి పడుతుందో ఎవరికీ తెలియదు

56.ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొచ్చే జ్ఞాపకాలే కాదు జారే కన్నీళ్లు కూడా భారీగానే ఉంటాయి

True Love Quotes In Telugu

57.జ్ఞాపకాల వలలో చిక్కుకున్న పిచుకలా
కన్నీటి సంద్రంలో అల్లాడుతున్న పడవలా
వెల్లువలా ముంచేస్తున్న వరదలా
చుక్కల వెలుగులో వెలిగే చందమామలా
ఉంది నా పరిస్థితి నువ్వు లేక…!!!

58.ప్రేమ రెండు అక్షరాల మహాకావ్యం
రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం.

59.జ్ఞాపకాల వలలో చిక్కిన నా మదిని
నీ రాకతో ఎప్పుడు వినిపిస్తాయి

60.ప్రపంచానికి ప్రేమ బానిస ఏమో కానీ 
డబ్బుకు ప్రపంచమే బానిస

61. ప్రేమలో పడిపోయి జీవితంలో ఎదగడం మర్చిపోవద్దు

62. వదిలేసి వెళ్లిన తర్వాత కొందరికి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి కానీ మరికొందరికి జ్ఞాపకాలతో పాటు తీరని బాధ కూడా పాటు మిగిలిపోతుంది.

63. ఈరోజుల్లో ఒకరికి సహాయం చేస్తే గుర్తు ఉంటావో లేదో తెలియదు కానీ గాయం చేస్తే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి.

64. నా డైరీలో తెల్ల కాగితాల కన్నా నువ్వు వెళ్లాక నీ జ్ఞాపకాలతో నింపుకున్న పేజీలే ఎక్కువ

65. నచ్చిన దాన్ని వద్దులేసుకోవడం చాలా కష్టం అలా అని పట్టుకోవడం కూడా కష్టమే.

66.  ప్రతిక్షణం ప్రతి చోటా నిన్ను వెతికే ఈ కనులు నువ్వు లేవని తెలిసి అలసిపోయాయి.

67.కలువ ఉండేది కొలనులో నువ్వు ఉండేది నా మదిలో

68. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్న వాళ్లు మన జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం

69. నా నమ్మకం నువ్వు చెప్పే మాటల్లో లేదు నిన్ను ప్రేమించే మనసులో ఉంది

70. క్యాలెండర్లో ఉన్న తేదీ మారినంత సులభం కాదు ఒకరి మీద ఉన్న ప్రేమని మార్చటం

71. దూరాన్ని మోస్తున్న నాకు నీ జ్ఞాపకాలే దగ్గర పరిచయం చేసాయి

72. తిరిగి చూడని వాళ్ళ కోసం ఎదురు చూడటం అనవసరం

73. పుస్తకాలు చదివినట్టు మనసుని చదవాలి ఏమో మనసుని మనసు ఇచ్చిన వారు మాత్రమే చదవగలరు

74. శూన్యం లో ఎవరు ఉంటారు అని తొంగి చూసా…..
ఆశ్చర్యంగా అక్కడ కూడా తనే ఉంది

75. మళ్లీ రావా అని అడగాలని ఉన్న…
కోటలోని రాణిని గుడిసెలోకి ఎలా తీసుకురావాలి అని ఆగిపోతున్న….

76. ప్రేమిస్తే ప్రాణమిస్తామో…
లేదో తెలియదు కానీ….
ప్రేమించిన వాళ్ళు దొరికితే మాత్రం, 
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాం…..

77. ప్రేమించిన వాళ్ళతో నీకోసం నా ప్రాణం ఇస్తాను అని చెప్పకండి నవ్వుతారు, ప్రాణంలా చూసుకుంటాను అనే నమ్మకం ఇవ్వండి చాలు….

78. తన రూపం గొప్పది కాదు 
కానీ తనలో ఎవ్వరూ లేరు 
తన రంగు గొప్పది కాదు 
కానీ తనకు సాటి ఎవరూ రారు

79. కన్నీళ్లు మనకు వస్తే అది కష్టం అవే కన్నీళ్లు మనకోసం వస్తే అది ప్రేమ

80. పెళ్లి ఒక అందమైన కల కానీ ప్రేమికులకు అందని కల

81. నా ఆనందానికి కారణం నువ్వే నా జ్ఞాపకాల కి అర్థం కూడా నువ్వే

82.ఒకప్పటి ప్రేయసి తాను… 
ఇప్పుడు నా జ్ఞాపకాల సామ్రాజ్యానికి మహారాణి

83. వేల అడుగులు వేస్తున్నా తన వైపు,
తనతో ఆ ఏడు అడుగుల కోసం

84.నీతో గడిపే ప్రతి క్షణం నేను ప్రేమలో పడ్డాను…
ఆ క్షణాల కోసం అయినా నేను మళ్లీ మళ్లీ పుడతాను

85. నీ నవ్వు నాకు ఒక వరం
నా మనసు నీ నవ్వుల వనం

86. నీ కళ్ళల్లో మొదలయి నా కన్నీళ్ళలో ముగిసినదే నా ప్రేమకథ*

87. చెప్తేనే తెలిసేది ఇష్టం 
చెప్పాలనుకున్న, చెప్పలేనిది చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ

88. నా జీవితం ఒక కాళీ పుస్తకం
నీ పరిచయం తో చేసావు ప్రేమ కావ్యం

89. మొదటి చూపు లోనే నా మనసు దోచేయడం నేరం, అందుకే శిక్ష గా నీపై ప్రేమను బంధించా నా గుండెల్లో జీవితాంతం

90.నీకు దగ్గర అయ్యాక ఇష్టమంటే తెలుసుకున్నా..
నువ్వు దూరం అయ్యాక ప్రేమ విలువ కనుగొన్నా

91.కావాలనుకున్న వారిని కాదు అంటుంది 
కుదరదు అన్న వారిని కోరుకుంటుంది
పిచ్చి హృదయం

92. నా నుంచి దూరం అయ్యావు అనుకుంటున్నావు 
కానీ నా మదిలో జీవిత ఖైదీ వి

93. నా వెంట నువ్వు లేకుండా 
నన్ను వెంటాడే నీ జ్ఞాపకాలు ఎందుకు మిగిల్చావు

94. ఒకరు దూరం అయ్యాక అర్థమవుతుంది
మన మనసుకు వారు ఎంత దగ్గర

95. నీ వెనుక పడుతున్న అని అనుకున్నాను కానీ
జీవితంలో వెనక పడి పోతుందా అని తెలుసుకోలేక పోయా

96. చచ్చేంత ప్రేమ కు చంపేంత బాధ తోడు

97.నటించే చోట జీవించొచ్చు
కానీ జీవించే దగ్గర నటించకు

98.కాలంతో కొందరిని మర్చిపోతాం 
కొందరితో కాలాన్నే మర్చిపోతాం

99. నా కలల రాజ్యపు రారాణి నీ రాజుని అయ్యే వరమీయవా

100. తన సంతోషం నాకు ఎంత ఇష్టమంటే నా ప్రేమను నేనే చంపుకునే అంత

101. ఈ విశ్వమంతా ప్రపంచంలో నేను ఆశపడింది నీ గుప్పెడంత గుండెల్లో చోటు

102. నీకు చదివి వినిపించ లేని నా ప్రేమ లేఖలన్ని 
మదిలో దాచిన నీ జ్ఞాపకాలు చదువుతున్నాయి

103. ప్రేమలో పడిపోయి జీవితంలో ఎదగడం మర్చిపోవద్దు

104. నా మనసులోని మాట నీ మనసులోకి చేరేది ఎప్పుడో 
నీ మనసు అర్థం చేసుకొని నాతో మాట్లాడేది ఎప్పుడో

105.ప్రేమలో పడిన మనిషికి
వలలో పడిన చేపకి సమస్యలు తప్పవు

106.ప్రేమంటే సంతోషాన్ని పంచేది
బాధని పెంచేది కాదు

107. అందమైన అమ్మాయి దొరకడం అదృష్టం అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం వరం

108. స్వచ్ఛమైన ప్రేమ వెతికితే దొరకదు దొరికితే వదలదు

109. ప్రేమించే మనసు ఉంటే సరిపోదు పోషించే స్థోమత కూడా ఉండాలి

110. నీకు దగ్గర అవ్వలేక నాకు నేను దూరం అవుతున్నాను

111. దగ్గరవ్వడానికి అబద్ధం చెప్తే నిజం తెలిసాక చాలా దూరం అవుతారు

112. దూరాన్ని పెంచుకున్నంత మాత్రాన బంధాన్ని తెంచుకునట్టు కాదు

113. ఇష్టమైన వారి కోసం తీసే పరుగులో అలిసిపోయినా ఆనందంగానే ఉంటుంది

114. గాలి నా లో చేరి ఊపిరైనట్టు నీ ఆలోచన నాలో చేరి ప్రేమగా మారింది

115. నువ్వు అక్షరం అవుతే అర్థం నేనవుతా*

116. మనిషికి నచ్చటం వేరు మనసుకి నచ్చటం వేరు

117. మనసులో ఉన్న ప్రేమని మనసిచ్చిన వారే అర్థం చేసుకుంటారు

118. పుస్తకాలు నేర్పని ఎన్నో పాఠాలు ప్రేమ నేర్పుతుంది

119. మనసిస్తే ప్రేమ దొరుకుతుంది అనుకున్నాను కానీ బాధ దొరుకుతుంది అని అనుకోలేదు

120.నీ పై ఉన్న ప్రేమను తెలపడానికి నాకు తెలిసిన పదాలు సరిపోలేదు

121.ప్రపంచమంతా తాకట్టు పెట్టిన నీపై ఉన్న ప్రేమకు వడ్డీ కూడా కట్టలేవు

122. కాలంతో మర్చిపోతాను అనుకున్నాను కానీ జీవితకాలం బాధిస్తావని తెలియదు.

Write A Comment