బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు శుభోదయం…

Good Morning Wishes in Telugu

  1.  జీవితమే శాశ్వతం కానప్పుడు
    జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం
    శాశ్వతం ఎలా అవుతాయి
    అందుకే ప్రతి నిమిషం
    నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం,
    శుభోదయం.
Good Morning Quotes Telugu
  1.  దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ
    మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.
  2.  దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం.
  3.  బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు.*
  4.  చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్లని చేయి పట్టుకొని నడిచే వాళ్లని ఎప్పటికీ మరువకు వదలకు.
  5.  సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది.
  6.  చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది.

Shubhodayam Quotes in Telugu

Good morning quotes in telugu
  1.  గతం గురించి ఆలోచించకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించకు భయమేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం మీ సొంతమవుతుంది.
  2.  భయపడటం ఎప్పుడు మానేస్తామొ అప్పుడే మన జీవితం మొదలైనట్లు.
  3.  మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది.*
  4.  ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు భయం వేసిన ముందడుగు వేయడం.*
  5.  ఓడి పోతున్నామని తెలిసిన క్షణంలోనే ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు.
  6.  నీ జీవితంలో ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుండి మొదలవుతుంది.
  7.  నేడు అవసరం లేనివి కొంటె రేపు అవసరం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది.
  8.  అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో పోరాడి ఓడిన వారు తిరిగి ఏదో ఒకరోజు గెలవడం కూడా అంతే సత్యం.*
  9.  నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.
  10.  గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడు గొప్పవాడు.*
  11.  పనిచేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది చేయద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది.
  12.  నేను చేసే పోరాటం రేపటి బంగారు భవితకు సోపానం.*
  13.  కష్టాలు భయపెట్టడానికి రావు ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి.*
  14.  తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు.
  15.  జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.*
  16.  కష్టాలు ఒంటరిగా రావు అవకాశాలను వెంట తీసుకు వస్తాయి ప్రతి కష్టం వెనుక దాగి ఉన్న అవకాశాన్ని గుర్తించగలిగినప్పుడు విజయం మీదే.
  17.  జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతి సారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే.*
  18.  మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది.*
  19.  మన జీవితంలో ఎదురయ్యే వారంతా మనకు గురువులు మంచివారు పాట నేర్పుతారు చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు.
Good Morning Quotes Telugu

Good Morning Quotes Telugu

  1.  ఆరడుగుల మనిషి విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది.
  2.  చివరి ప్రయత్నం అంటే చివరి సారి చేసే ప్రయత్నం కాదు మొదటి సారి గెలిచే ప్రయత్నం.
  3.  ఎప్పుడు నవ్వుతూ ఉండు ఈ ప్రపంచంలో నీ కన్నా అందంగా ఎవరు ఉండరు.
  4.  పూలతో నిండి ఉన్న తోట ఎంత అందంగా ఉంటుందో  మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.
  5.  ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
  6.  కఠోర పరిశ్రమ అనంతరం లభించే విజయం తియ్యగా ఉంటుంది.
  7.  గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యమవుతాయి.
  8.  ఒక మనిషి ఓడి పోవడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ గెలవడానికి ఒకే ఒక కారణం అదే శ్రమించడం.
  9.  ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చేరలేని ఎత్తులు లేవు ఎక్కలేని శిఖరాలు లేవు.

గుడ్ మార్నింగ్ కోట్స్ తెలుగు లో

  1.  దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడు విజయానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తాడు.
  2.  వినడంలో మనిషి తొందర పడాలి కానీ మాట్లాడడంలో కాదు.
  3.  నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది
  4.  పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు.*
  5.  నిన్ను నువ్వు నమ్మినప్పుడే గెలుపు మొదలవుతుంది.*
  6.  మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.
  7.  నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.
  8.  మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి.
  9.  మార్పు మనం అనుకున్నంత తేలిక అయితే కాదు అలా అని అసాధ్యం కూడా కాదు.
  10.  ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చు.
  11.  జరిగిపోయిన నిన్న జరగబోయే రేపటి కంటే ఈరోజు చాలా విలువైనది.*

Good Morning Message in Telugu

  1.  నీవు ఎప్పుడూ పొందని నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయలేని కృషి చేయాలి.*
  2.  ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది.
  3.  జీవితంలో ఎందుకు ఓడిపోతున్నా మని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది.
  4.  ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదో గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు.*
  5.  నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు.
  6.  కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం మీ సొంతమవుతుంది.
  7. గెలుపు వెనుక పరిగెత్తకుండా జ్ఞానం వెనుక పరిగెత్తు గెలుపు నీ వెనుక పరిగెడుతుంది.*

Also Read :
Love Quotes in Telugu | తెలుగు లవ్ కోట్స్
Top 100+ Telugu Samethalu | తెలుగు సామెతలు

Write A Comment