Happy Sankranti wishes in telugu 2024. మీ బంధు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో వచ్చే పండుగ సంక్రాంతి.

తెలుగు వారికి , తమిళులకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో 4 రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుకుంటారు. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదిన జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే 15వ తేదీన జరుపుకుంటారు.
మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని భావం.
ఈ సందర్భంగా మీ అందరి కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను మీ ముందుకు తీసుకవచము. వీటిలో మీకు నచ్చిన వాటిని మీ బంధు మిత్రులకు పంపి శుభాకాంక్షలు తెలియచేయండి..

Sankranti Wishes in telugu

నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,
మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.
పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ…
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Sankranthi Wishes telugu Images
Sankranthi Wishes telugu Images

పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు

Sankranthi Wishes in telugu 3
Sankranthi Wishes in telugu

ఇంటికొచ్చే పాడిపంటలు..కమ్మనైన పిండి వంటలు.. చలికాచే భోగి మంటలు..సంతోషంగా కొత్త జంటలు.. ఏటా సంక్రాంతి… ఇంటింటా కొత్త కాంతి..

సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.


Sankranti subhakankshalu.

భోగి మీకు భోగ భాగ్యాలను సంక్రాంతి మీకు సర్వ సుఖాలు  కనుమ కష్టాలను తొలగించాలని కోరుకుంటూ….
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

పాల పొంగళ్ళు, రంగుల ముంగిళ్ళు, ముద్దు గొలిపే గొబ్బిళ్ళు, బావ మరదళ్ల ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు.. పొంగల్ శుభాకాంక్షలు


Sankranti Quotes

భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

జంట సన్నాయి మేళం జోడు బసవన్నల తాళం మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
సంక్రాంతి శుభాకాంక్షలు.

Happy Sankranti in Telugu.

సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..

మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో… కళ కళలాడే వాకిళ్ళు… ఆనంద నిలయాలు… మీ ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Sankranthi Wishes telugu Images
Sankranthi Wishes telugu Images

Also Read:
BR Ambedkar Telugu Quotations| అంబేద్కర్ కోట్స్
Kalam Quotes Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Motivational Quotes in Telugu
Happy Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి

Write A Comment