పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.
Greet your loved once happy birthday wishes in telugu with these Quotes, Messages and Greetings
Birthday Wishes For Mom in Telugu
- అమ్మా నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday Wishes For Dad in Telugu
- జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను . అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నగారికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
- గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday Wishes For Friends in Telugu
- హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
- భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను చేరాలని.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- కోటి చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నువ్వు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త సంతోషాలు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Birthday wishes For Son in Telugu
- చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు సంతోష పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
- నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను ఉన్నాను అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
- నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరిచిపోలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
Birthday Wishes For Sister in Telugu
- నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
- నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందు నువ్వే ఉంటావు అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నేను చిన్నప్పుడు గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
Birthday Wishes For Brother in Telugu
- ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
- తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నిన్ను మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
- నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.