Collection of Fake Relative Quotes in Telugu. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.
Fake Relative Quotes in Telugu
- వంద కుక్కలు ఒక్కటై ఒక్క సారిగా మొరిగిన
సింహం గర్జన కు సమానం కాదు
ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడూ నిజం కాదు - కాలం మనుషులని మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది
- మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం
- గౌరవం అనేది వయస్సుని బట్టి ఉండదు వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
- అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు.
- అందరూ ఉండి పట్టించుకోలేదనే బాధ కంటే ఎవరు లేరు నాకు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది.
- నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్లాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం.
- చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.
- అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు.
- కొంతమంది కేవలం మనల్ని కిందికి లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో 75 శాతం మన బంధువుల ఇళ్లలోనే పుడతారు.
- నటన తో కూడిన బంధాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
- మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.
- జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళు కొని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు.
- మనం ఎప్పుడు ఓడిపోతానేమో ఎప్పుడు పడిపోతాయో అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు ఇది నిజం.
- కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు.
- పాము కోరల్లోని విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం.
- నవ్వడం మాత్రం నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్నవాళ్లు నేర్పుతారు.
- ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం.
- మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం.
- ఎంత ఇష్టపడితే, అంత అలుసు
ఎంత ప్రేమిస్తే అంత బాధ
ఎంత నమ్మితే అంత ద్రోహం
- నీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి.
- ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తుల్లో ఆత్మీయత ఉంటుంది.
- నేటి సమాజంలో అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు అవసరం తీరాక నువ్వెంత అంటారు.
- నిన్ను నమ్మిన వారికి నమ్మకద్రోహం చేసావా తొందర పడకు నీకు కూడా అదే గతి పడుతుంది.
- అతిగా నమ్మిన బంధమే నమ్మకద్రోహం చేస్తుంది.