Motivational Quotes in Telugu, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది..
Best Motivational Quotes in Telugu
1.సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు.
2.గమ్యం దూరమైన పయనాన్ని ఆపద్దు.
మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు.
3.సగం జీవితం వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది.
4.ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి.
5.నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది
6.వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు.
7. తిరిగిరాని గతమా
తిరుగుతున్న వర్తమానమా
తిరుగులేని భవిష్యత్తా
- మార్పు మనం అనుకున్నంత తేలికైతె కాదు అలా అని అసాధ్యం కూడా కాదు
- లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డిపరకల వాడుకో లేడు.
Short Motivational Quotes in Telugu
- ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు
- చివరి ప్రయత్నం అంటే చివరి సారి చేసే ప్రయత్నం కాదు మొదటి సారి గెలిచే ప్రయత్నం
- మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు మంచి లక్షణాలు కూడా కావాలి#
- ఆలోచనలకి అందినా అన్ని ఆశలు చేతికి కూడా అంతే బాగుంటుంది.
- పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగ లేవు.
- ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది.
- దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది.
- జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంత అవుతుంది.
- బద్దకస్తుడు కి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు.
- ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి.
- ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం.
Powerful Motivational Quotes in Telugu
- గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి తెలిసిన వారే గొప్పవారు.
- ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు.
- జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే మిత్రమా.
- మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం.
- గెలుపు లో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులు గా ఉండి పోతారు.
- మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.
- అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.
- పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు.
Motivational Quotes for in telugu for students
- ఒక్క నిజం కొద్దికాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తోంది.
- ప్రతి సారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారీ లేవాలి.
- జీవితంలో ఎప్పుడూ కూడా నటించే వద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది.
- వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉంటాడు.
- పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరచిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో ,కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో.
- బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా వస్తూనే తన సొంత వాళ్లని గుర్తుకు వచ్చేలా చేస్తుంది సంపద వస్తూనే మనకు సొంత వాళ్లను కూడా మర్చిపోయేలా చేస్తుంది.
- విషాన్ని ఎన్నిసార్లు వడపోసిన అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే.
Motivational Quotes in Telugu For Success
- రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు
అలలు లేని సముద్రానికి అందం లేదు
సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు
లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు
- చినుకంత అనుమానం ఏ బంధానికి అయినా ప్రమాదం
సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ,
ద్వేషానికి దూరానికి అదే మూల కారణం
- ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించ లేనప్పుడూ ఓర్పు సహనం మాత్రమే నిన్ను గేలిపించగలవు.
- మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ
మన ఇష్టాలని కష్టాలన్నీ పంచుకోవడానికి
భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం
- ఎదుటివారి మారకుంటే మీరే మారండి లేదంటే బాధ పడటం నిత్య మీ వంతు అవుతుంది.
- పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది
అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి. - ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప.
- మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు.
- మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు మన ఇష్టాల్ని కష్టాల్ని గౌరవించిన వారే మనవారవుతారు.
- బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది.
- జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు.
- గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి.
- నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.
- గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది.
- నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పిన అర్థం కాదు.
- నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది గుళ్ళు కట్టక్కర్లేదు గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు.
- కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యము చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా.
- కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు, అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు.
- నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి.
- మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి.
- ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా
నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించి చూడు - మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి.