Telugu Prapamcham | Telugu Blog https://teluguprapamcham.com/ Telugu Quotes, Telugu Festival Wishes Sun, 07 Apr 2024 20:31:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5 https://teluguprapamcham.com/wp-content/uploads/2022/05/cropped-తెలుగు-ప్రపంచం-Logo-32x32.png Telugu Prapamcham | Telugu Blog https://teluguprapamcham.com/ 32 32 TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/ https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/#respond Sat, 02 Sep 2023 19:33:13 +0000 https://teluguprapamcham.com/?p=4650 టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ షెడ్యూల్‌ ప్రకారం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం పరీక్షా తేదీలు ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్‌ 4, 5, 6, 8 వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. Organization Telangana Public Service Commission Exam Name TSPSC Exam 2023 Name of the Posts TSPSC Government Polytechnic [...]

The post TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
TSPSC September Exam schedule
TSPSC September Exam schedule

టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ షెడ్యూల్‌ ప్రకారం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం పరీక్షా తేదీలు ప్రకటించింది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్‌ 4, 5, 6, 8 వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Government Polytechnic Lecturer
TSPSC Exam Date 2023September 4/5/6/8
Official Websitetspsc.gov.in
TSPSC Government Polytechnic Lecturer Exam Schedule


ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Government Physical Director
TSPSC Exam Date 2023September 11
Official Websitetspsc.gov.in
TSPSC Government Physical Director Exam Schedule


ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్‌ 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29 వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్ణయించింది

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Junior College Lecturer
TSPSC Exam Date 2023September 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29
Official Websitetspsc.gov.in
TSPSC Government Junior College Lecturer Exam Schedule

Share this with your friends and TSPSC Government Exam aspirants.

The post TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/feed/ 0
Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/#respond Mon, 28 Aug 2023 18:05:50 +0000 https://teluguprapamcham.com/?p=4647 collection of best onam wishes in telugu. 8, ఈ ఓనం పండుగ.. మీ కుటుంబంలో సుఖసంతోషం తియ్యదనం నింపాలని కోరుకుంటూ మరోసారి ఓనం పండగ శుభాకాంక్షలు....

The post Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
1, ఓనమ్ సందర్భంగా మీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండాలని.. మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు

2, ఓనమ్ పండుగ నాడు ప్రతి ఇంటి ముందు కళకళలాడే రంగవల్లులు, పులివేషాలతో ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు

3, మామిడి తోరణాలతో, ముత్యాల ముగ్గులతో.. కళకళలాడే వాకిళ్లు, ఆనంద నిలయాలు, మీ ఇల్లు ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు

Onam Wishes in Telugu

4, ఓనమ్ రంగులు మీ జీవితాన్ని రంగులమయంగా మార్చాలి. మీ జీవితంలో ప్రతిక్షణం పాయసం లాంటి మాధుర్యాన్ని పొందాలి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. మీ ఇంట్లో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఓనమ్ శుభాకాంక్షలు

5, నువ్వు ఎక్కడ ఉన్నా.. నువ్వు ఏది కోరుకున్నా.. ఈ ఓనమ్ పండగ సందర్భంగా అన్ని నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ ఓనమ్ శుభాకాంక్షలు.

6, ఈ ఓనమ్ పండుగ మీ ఇంట్లో అందరికీ శుభాలను కలిగించాలని, మీ జీవితంలో ఎంతో సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధింపబడాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు. హ్యాపీ ఓనమ్.

7, నేను వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కానీ ఓనం పండగ ఉత్సాహం ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది.. ఎక్కడున్నా ఓనం పండుగని ఆహ్లాదకరంగా జరుపుకుందాం

8, ఈ ఓనం పండుగ.. మీ కుటుంబంలో సుఖసంతోషం తియ్యదనం నింపాలని కోరుకుంటూ మరోసారి ఓనం పండగ శుభాకాంక్షలు

9, నువ్వు ఎక్కడ ఉన్నా.. నువ్వు ఏది కోరుకున్నా.. ఈ ఓనమ్ పండగ సందర్భంగా అన్ని నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ ఓనమ్ శుభాకాంక్షలు.

10, ఈ ఓనమ్ పండుగ మీ ఇంట్లో అందరికీ శుభాలను కలిగించాలని, మీ జీవితంలో ఎంతో సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధింపబడాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు. హ్యాపీ ఓనమ్.

The post Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/feed/ 0
ఓనం 2023 ఆసక్తికరమైన కథ చరిత్ర మరియు పండుగ ప్రాముఖ్యత తెలుసుకోండి https://teluguprapamcham.com/festival-history/about-onam-in-telugu/ https://teluguprapamcham.com/festival-history/about-onam-in-telugu/#respond Mon, 28 Aug 2023 17:49:33 +0000 https://teluguprapamcham.com/?p=4643 ఓనం వామనుడు మరియు మహాబలి రాజును గౌరవిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, పురాణ రాక్షస రాజు మహాబలి ప్రదర్శించిన తెలివైన నాయకత్వానికి గౌరవసూచకంగా కేరళలో ఓనం జరుపుకుంటారు...

The post ఓనం 2023 ఆసక్తికరమైన కథ చరిత్ర మరియు పండుగ ప్రాముఖ్యత తెలుసుకోండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
ఓనం వామనుడు మరియు మహాబలి రాజును గౌరవిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, పురాణ రాక్షస రాజు మహాబలి ప్రదర్శించిన తెలివైన నాయకత్వానికి గౌరవసూచకంగా కేరళలో ఓనం జరుపుకుంటారు.

ఓనం అనేది భారతదేశంలోని వార్షిక పంట పండుగ, దీనిని కేరళలోని హిందువులు ఎక్కువగా పాటిస్తారు. ఓనం వామనుడు మరియు మహాబలి రాజును గౌరవిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, పురాణ రాక్షస రాజు మహాబలి ప్రదర్శించిన తెలివైన నాయకత్వానికి గౌరవసూచకంగా కేరళలో ఓనం జరుపుకుంటారు.

ఓనం యొక్క అర్థం

ఓనం అనేది కేరళలోని హిందువులు ఎక్కువగా జరుపుకునే వార్షిక భారతీయ పంట పండుగ. కేరళీయులకు ఒక ప్రధాన వార్షిక కార్యక్రమం, ఇది రాష్ట్ర అధికారిక పండుగ మరియు సాంస్కృతిక కార్యక్రమాల స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది.

ఓనం యొక్క అర్థం

ఓనం అనేది మహాబలి రాజు స్వదేశానికి వచ్చిన సందర్భంగా జరుపుకునే పంట పండుగ. పురాణాల ప్రకారం, మహాబలి ఒక దయగల రాజు, అతను న్యాయం మరియు కరుణతో కేరళను పాలించాడు. అతను తన ప్రజలచే ఎంతగానో ప్రేమించబడ్డాడు, అతని మరణం తర్వాత అతను తిరిగి రావాలని వారు ప్రార్థించారు.   

The post ఓనం 2023 ఆసక్తికరమైన కథ చరిత్ర మరియు పండుగ ప్రాముఖ్యత తెలుసుకోండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/festival-history/about-onam-in-telugu/feed/ 0
Independence Day Telugu Speech for Students https://teluguprapamcham.com/telugu-speech/independence-day-telugu-speech/ https://teluguprapamcham.com/telugu-speech/independence-day-telugu-speech/#respond Thu, 10 Aug 2023 15:41:00 +0000 https://teluguprapamcham.com/?p=4624 Independence day speech in Telugu, భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా , నా ఆలోచనలను తెలియజేయడానికి నేను ఇక్కడకి వచ్చాను

The post Independence Day Telugu Speech for Students appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా , నా ఆలోచనలను తెలియజేయడానికి నేను ఇక్కడకి వచ్చాను. మన స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దాన్ని రక్షించుకోవడానికి అత్యున్నత త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నాం.
ఆగష్టు 15, 1947 న , భారతదేశం సార్వభౌమ దేశంగా తన హోదాను సాధించింది, ఇది మన పూర్వీకుల త్యాగం ద్వారా సాధ్యమైంది. ప్రతి సంవత్సరం, ఈ తేదీన, భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొందిన రోజుని గౌరవించటానికి మనము స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.
ఈ గొప్ప ఘట్టాన్ని గుర్తుచేసికునేందుకు, ఇక్కడ ఉన్న మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ రోజు కేవలం ఆనందం మరియు ఉత్సవాల కంటే మనం గుర్తించాల్సింది, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకునే మరియు గౌరవించే రోజు.
బ్రిటిష్ వారు మొదట్లో వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు, కానీ అది భారతదేశ బానిసత్వానికి దారితీసింది. మన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా నిరసనలు మరియు తిరుగుబాట్లను చేశారు, చివరికి అది మన దేశ విముక్తికి దారి చూపింది .
స్వాతంత్య్ర దినోత్సవం అనేది భారతదేశ స్వేచ్ఛకు మార్గం సుగమం చేసిన రోజు. మరొకసారి మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, జైహింద్.


Also Read
Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్
Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

The post Independence Day Telugu Speech for Students appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-speech/independence-day-telugu-speech/feed/ 0
Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/#respond Thu, 10 Aug 2023 14:36:36 +0000 https://teluguprapamcham.com/?p=4605 Independence day quotes in telugu, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..

The post Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Independence day quotes in telugu, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..

Independence Day Quotes in telugu

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

independence day quotes telugu
independence day quotes telugu


Best Independence Day Quotes in telugu

నేటి మన స్వాతంత్ర్య సంభరం.. త్యాగఫలం. ఎందరో త్యాగవీరుల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం.. అభివందనం…స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

సిరులు పొంగిన జీవగడ్డ.. పాలు పారిన భాగ్యసీమై.. రాలినది ఈ భారతఖండం.. భక్తితో పాడరా సోదరా.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day Quotes Images in telugu

దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.

Independence Day Quotes in Telugu
Independence Day Quotes in Telugu

ఆంగ్లేయుల చెర నుంచి భారతన్ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


Happy Independence Day Quotes in telugu 2023

స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్ చేయడం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి. స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్ను నిర్మించుకుందాం.

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

independence day quotations Telugu status Image, independence day quotes Telugu
independence day quotations Telugu status Image

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా..
ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు
గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

independence day telugu images, Independence Day Quotes in Telugu
independence day telugu images, Independence Day Quotes in Telugu

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read
Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Samethalu in Telugu
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

The post Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/feed/ 0
Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/#respond Thu, 10 Aug 2023 13:46:44 +0000 https://teluguprapamcham.com/?p=4592 Independence day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చేసేందుకు తెలుగు కోట్స్ మీ కోసం.

The post Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Independence day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవం 2023 సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చేసేందుకు తెలుగు కోట్స్ మీ కోసం.

భారతదేశానికి 1947 సం॥ ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చింది. ఈ తేదీన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది కనుక మన భారతీయులందరికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.
దీనినే ఆంగ్లంలో ఇండిపెండెన్స్ డే అని అంటారు.

నేను భారతీయుడనైనందుకు గర్వపడుతున్నాను..
సదా నేను భరతమాతకు ఋణపడి ఉంటాను..
వందేమాతరం..మీకు, మీ కుటుంబసభ్యులకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day Quotes in Telugu
Independence Day Quotes in Telugu

Independence Day Greetings in Telugu

భారతీయతని భాద్యతగా ఇచ్చింది నిన్నటి తరం..
భారతీయతని బలంగామార్చుకుంది నేటి తరం..
భారతీయతని సందేశంగా పంపుతాం మనం… తరం తరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day wishes in Telugu

  • ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా
    పొగడరా నీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • శ్రీలు పొంగిన జీవగడ్డయి
    పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా!
    మీ కుటుంబసభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day messages in Telugu

  • నింగికెగసిన స్వరాజ్య నినాదం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం.భరతమాత చేతిలో..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం.. అభివందనం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • ఎందరో త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్య్రం బానిస సంకెళ్ళు తెంచి స్వేచ్ఛావాయువుల కోసం వందల ఏండ్లు పోరాడినయోధులను స్మరించుట మన కర్తవ్యం
    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • భారత దేశానికి స్వాతంత్య్రాన్ని అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులు అందరికీ వందనములు!
    మిత్రులందరికీ స్వాతంత్య్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Independence Day wishes Telugu, Independence day Telugu messages
Independence Day wishes Telugu, Independence day Telugu messages

Independence day whatsapp status in Telugu

  • నింగికెగసిన స్వరాజ్య నినాదం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం.. మిత్రులందరికీ స్వాతంత్య్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Also Read
Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్
Samethalu in Telugu
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

The post Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/feed/ 0
Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/#respond Fri, 04 Aug 2023 18:48:57 +0000 https://teluguprapamcham.com/?p=4557 Friendship day quotes in telugu ,ఈ జిందగిలో ఆస్తులు లేనివాడు... పేద వాడు కాదు... ఫ్రెండ్స్ లేని వాడు పేదవాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

The post Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Friendship day wishes in Telugu
Friendship day wishes in Telugu
  • చెప్పే ప్రతి విషయాన్నీ వినేవాడు ఫ్రెండ్ చెప్పే ప్రతీ విషయంలోనూ ఉండేవాడు ఫ్రెండ్,
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  •  స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను అని భుజం తట్టి చెప్పడం, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  •  విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • మీ ప్రతిభని గుర్తిస్తాడు నీ గెలుపుని ఊహిస్తాడు గెలిచిన ప్రతి ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఈ జిందగిలో ఆస్తులు లేనివాడు… పేద వాడు కాదు… ఫ్రెండ్స్ లేని వాడు పేదవాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • సంపదకన్నా బలమైనది, స్వార్థం లేనిది,
    ప్రతిఫలం కోరనిది,
    కుల మతం లేనిది, స్నేహం
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • “బావున్నా” అని నవ్వుతూ చెప్పినా.. “సరేలే.. ఇప్పుడు నిజమేంటో చెప్పు” అని అడిగేవాడు, స్నేహితుడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • ఎవరు రాయలేని విలువైన పుస్తకం స్నేహం ! అందరికి అరుదుగా దొరికే అదృష్టం స్నేహం ! నేను కొనలేనిది నాకు దొరికినది అదే నీ స్నేహం “నేస్తమా, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • బంధంగా పుట్టకపోయినా
    అనుబంధంగా రూపుదిద్దుకొని..
    కలసిన సమయం నుండి
    కడదాకా నీడనిచ్చేదే “స్నేహం”
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • గొప్ప గొప్ప వాళ్ళ నాకు
    స్నేహితులు కావాలని
    కోరుకోను
    నా స్నేహితులందరూ
    గొప్పవాళ్ళు
    కావాలని కోరుకుంటాను!!
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
Friendship day Quotations in telugu | Friendship Day Quotes in Telugu
Friendship day Quotations in telugu
Friendshipday Quotes in Telugu 2023
Friendship day Quotes in Telugu

The post Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/feed/ 0
Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/#respond Sun, 28 May 2023 05:58:51 +0000 https://teluguprapamcham.com/?p=4531 Read Love failure quotes in telugu,  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.

The post Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Love failure quotes in telugu,  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.

Love Failure Quotes in Telugu

  1.  ఎన్ని కాంతులు ఉన్నా వెలుతురు దరిచేరదు నువ్వు నా చెంత లేకుంటే.
  2.  ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా ఉన్నా నువ్వు నా మనసు తో ఆడిన ఆట కి ఏ బహుమతి ఇచ్చినా సరిపోదు.
  3.  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.
  4.  తను నన్ను కారణాలతో కాదు సమాధానం దొరకని ప్రశ్న లతో వదిలేసి వెళ్ళింది.
  5.  వాళ్లు వద్దనుకున్నంత తేలికగా మనం మర్చిపోలేం.
  6.  చెప్పింది చేయలేదని చెప్పకుండా వెళ్ళిపోయింది.
  7.  నీ మాట వరం నీ మౌనం శాపం.
  8.  నువ్వు లేవనే నిజాన్ని నమ్మలేను నీ పరిచయము అబద్ధం అనుకొని మర్చిపోలేను.
  9.  ప్రేమలో ఓడిపోలేదు ప్రేమించే ఓడిపోయాను.
  10.  నిన్ను మర్చిపోలేను నన్ను నేను మార్చుకోలేను.
  11.  కంటికి కనిపించనంత దూరంలో నువ్వున్న  నీ జ్ఞాపకాలు నీతో గడిపిన క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.
  12.  హలో రోజులు తెలియలేదు నువ్వు వెళ్లిపోయాక రోజులు గడవడం లేదు.
  13.  మనసులో ఎన్నో మాటలు దాగిపోయాయి నువ్వు వదిలేసిన బాధలో మునిగిపోయాయి.
  14.  నిన్ను ఎంతగానో మార్చేది వాళ్లే నువ్వు ఎంత మారిపోయావు అనేది వాళ్లే.
  15.  నువ్వు మాటిచ్చి మనిషిని మరిచావు మనసిచ్చి నన్ను నేను మరిచాను.
  16.  ఎన్ని గొప్ప చదువులు చదివి ఏం లాభం మీ మనసుని చదవలేకపోయాను.
  17.  ఎన్ని ఉన్నా ఎందరున్నా నువ్వు లేని లోటు ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది.
  18.  క్షణం లో పుట్టి క్షణక్షణం బాధించేది ప్రేమ.
  19.  ఈ జీవితం నిన్ను పరిచయం చేసి నన్ను ఒంటరి వాడిని చేసింది.
  20.  నువ్వు చూపించిన ప్రేమ కంటే నువ్వు మిగిల్చి వెళ్ళిన బాధ ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది.
  21.  నిన్ను విడిచి ఉండగలను నీ జ్ఞాపకాలను వదిలి ఉండలేను.
  22.  నువ్వు చేసిన ప్రతి గాయం ఓ జ్ఞాపకంలా మారి బ్రతుకంతా బాధిస్తూనే ఉంది.
  23.  మనసున్న మనుషులకే మనసులు లేని మనుషులు పరిచయమవుతారు.
  24.  ప్రతి బలమైన మనిషి వెనుక ఒక బలహీనమైన గతం ఒక మరిచిపోలేని మనిషి ఉంటాడు.
  25.  వదిలి వెళ్లిపోయారని బాధపడకు నీ ప్రేమను పొందే అర్హత వాళ్లకి లేదు వాళ్లు నేర్పిన పాఠాల్ని గుర్తుపెట్టుకో నేర్పిన వాళ్ళని మర్చిపో.
  26.  నాలో సగం అయ్యావు సగం గానే వదిలేసావు.
  27. నన్ను మర్చిపోవడానికి నీకో క్షణం నిన్ను మర్చిపోవడానికి నాకో జీవితం.
  28.  దూరం అయ్యావని నువ్వు అనుకుంటున్నావు దగ్గరయ్యావని నేను అనుకుంటున్నా.
  29.  తెల్లవారితే మారే బంధం కాదు మరో జన్మ వరకు మరిచి పోలేని  బంధం కావాలి.
  30. ఒక్కోసారి అనిపిస్తుంది,
    ఎందుకు ఇంత ఆలోచన
    ఎవరి కోసం ఇంత ఆవేదన అని

Love Failure Quotes telugu for girl

  1.  అర్థం కానివి ఎన్నో,
    అర్థం లేనివి మరెన్నో నా జీవితంలో .

love failure quotes telugu for boy

  1.  ఒక రోజు నా కోసం నాలాగే ఎదురు చూడు అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అని.
  2.  కన్నీళ్లు తుడిచే వాళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ కన్నీళ్లు పెట్టించే వాళ్లు మాత్రం అస్సలు ఉండకూడదు
  3.  నా మనసు నా మాట వినడం లేదు  నిన్ను ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోన్నివ్వడం లేదు.
  4. గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడడం వేరు గుర్తుంచుకొని మాట్లాడడం వేరు.

Also Read
Love Quotes in Telugu | లవ్ కొటేషన్స్ తెలుగు
Abdul Kalam Quotes in Telugu
Money Quotes in Telugu
Manchi Matalu in Telugu

The post Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/feed/ 0
Samethalu in Telugu 100+ | తెలుగు సామెతలు తెలుసుకోండి. https://teluguprapamcham.com/telugu-proverbs/samethalu-telugu/ https://teluguprapamcham.com/telugu-proverbs/samethalu-telugu/#respond Sat, 27 May 2023 09:46:41 +0000 https://teluguprapamcham.com/?p=4529 1.చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు!
2.అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
Read more....

The post Samethalu in Telugu 100+ | తెలుగు సామెతలు తెలుసుకోండి. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Collection of best samethalu in telugu, We have curated for telugu readers చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు!

Samethalu in Telugu | Read Best Samethalu in Telugu

  1. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

    ఒక అధికారి తన కింద పనిచేసే వారిని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ సమాధానము చెప్పవలసిందే లేకపోతే ఇబ్బంది. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అవుతాడు.
  2. భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట

    బజార్లో పెడితే ఎవరైనా దాన్ని ఎత్తుకెళ్తారు అని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టిందంటే దానికి అస్సలు భయం లేదని అర్థం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యావసానాలు ఆలోచించి చేయాలి అని చెప్తోంది ఈ సామెత
  3. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా!

    బాధలో కాని ఆనందంలో కాని ఉన్నప్పుడు నోటికి అదుపు లేకుండా మట్లడుతుంటాం కొన్నిసార్లు మనం. దాని వల్ల కలిగే నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరము అనుభవించే ఉంటాం. దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించటం కష్టం. కనుక మన నోటి నుంచి జాలువారే ప్రతి మాట చాల ముఖ్యం అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.

    మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి.. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిస్వార్థంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఒకరిని చూసి మరొకరు నిస్వార్ధంగా ఉండటం నేర్చుకుంటారో.. అప్పుడు ఆ ఊరు కూడా మంచిదవుతుంది అని ఈ సామెత యొక్క అర్థం.
  2. చేతిలో సుత్తి ఉంటే ఏదైనా మేకు లానే కనపడుతుంది.

    మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యని కేవలం మనకి తెలిసిన పరిమిత జ్ఞానంతోనే ఆలోచించకుండా విశ్లేషణ చెయ్యాలి అని ఈ సామెత అర్థం.
  3. లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

  4. ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు

    ఉచితంగా ఏదన్నా దొరుకుతోంది అంటే దాన్ని దక్కించుకోవటానికి ఏదైనా చేస్తాం, ఎందుకంటే ఆశ అనేది సర్వసాధారణం కనుక. కాని కొంతమందిలో ఇది చాలా ఎక్కువ పాళ్ళలో చూస్తాం. అలా అత్యాశ ఉన్నవాళ్ళ గురించి చెప్పే సామెత ఇది.
  1. డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది

    డబ్బు ముందు సత్యం నిలవలేదు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం.
  2. వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు!

    “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు” అని మన పవర్ స్టార్ సినిమాలో చెప్పినట్టు…ఎంతవాడికైనా ఒక్కోసారి కాలం కలసి రాకపోతే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. వారి జీవితం ముందుకి సాగాలి అంటే ఎంతటి స్థాయికైనా దిగాల్సి వస్తుంది. అలాంటి సంధర్భాల్లో ఈ సామెత చెప్తూ ఉంటారు.
    అసలు కథ…
    లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు.
  3. చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు!

    మనిషికి మనశ్శాంతి ఉన్నప్పుడే హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడే కంటినిండా కునుకు పడుతుంది. చింతలు, చికాకులు, భయాలు, ఆందోళనలు అశాంతికి గురి చేస్తాయి, నిద్రను దూరం చేస్తాయి. అందుకే చింత లేకుండా హాయిగ బతికే తీరులో బతకండీ అని చెప్తుంటారు పెద్దలు.
    సంతలో అంతా సందడి సందడిగా ఉంటుంది. అమ్మకందారుల కేకలూ, కొనుగోలుదారుల బేరాలు. వీటితో ధ్వని కాలుష్యంగా ఆ ప్రదేశమంతా ఉంటుంది. అయినప్పటికీ ఒక మనిషి హాయిగా అక్కడ నిద్రపొతున్నాడంటే అతనికి ఎలాంటి చింతలు లేవని అర్థం.

అంటే చింతా, చికాకులు లేకుండా ఉండటంలోనే అసలైనా ఆనందం ఉన్నదన్నది ఈ సామెత సందేశం.

  1. కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది.

    ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోవటం.

ఆకలితో వున్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపుకు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ వుద్దేశముతో చెప్పినదే ఈ సామెత.

  1. మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్టు!

    వెనకటికి ఒకాయన సాము గరిడీ విద్యలు నేర్చాడట. ఆ విద్యను చూపి అందరి మీదా జబర్దస్తీ చేసేవాడట. అతని పహిల్వాన్‍ చేష్టలకు ఆ ఊరు ఊరంతా భయపడేదట. జనులు తనను చూసి భయపడటంతో అతగాడు మరింత రెచ్చిపోయి అందరిపై పెత్తనం చెలాయించేవాడట. అతగాడెంతో మొనగాడన్నట్టు ఆ ఊరివాళ్లంతా అతనికి వంగి వంగి దండాలు పెట్టే వారట. ఏ ఆపద వచ్చినా, కష్టమొచ్చినా అతనికే చెప్పుకునే వారట. అయితే అయ్యవారికి అంత ‘సన్నివేశము’ లేదు. ఏదో కాస్త కండలు చూపి పైపై ఆర్భాటం చేయటమే తప్ప నిజానికి అతనికి ఏమాత్రం వస్తాదుతనం లేదు. ఒకనాడు ఊళ్లో దొంగలు పడ్డారు. అందరికంటే ముందు ఈ వస్తాదు గారే తలుపులు వేసుకుని దాక్కున్నారు. అందరూ ఇది చూసి అయ్యో.. ఇదా నీ మగతనం అని నోళ్లు నొక్కుకున్నారు. ఒకరోజు ఊళ్లో ఒక ముసలావిడ ఇదే విషయమై దారిన వెళ్తున్న వస్తాదు గారిని ప్రశ్నించిందట. దీంతో ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొచ్చిన ఆ వస్తాదు.. పట్టరాని కోపంతో వృద్ధురాలు అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. ఇది చూసిన వారంతా.. దొంగలు, దుర్మార్గుల్ని ఏం చేయలేడు కానీ, బలహీనులపై ప్రతాపం చూపుతున్నాడంటూ తిరగబడ్డారు. అటువంటి వ్యక్తిని ఉద్దేశించే పై సామెత పుట్టింది.. ‘మూడు నెలలు సాము విద్య నేర్చి.. చివరకు ముసలిదాన్ని కొట్టాడు’ అని ఎవరైనా అధికుల మని, అధికారం చాటుకునే వారి గురించి దెప్పి పొడిచే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.
  2. కుడి చేతితో చేసే దానం ఎడమ చెయ్యి ఎరుగరాదు!

    నిస్వార్థంగా చేసే దాన్నే దానం అంటారు. తిరిగి ఏమైనా ఆశిస్తే (పుణ్యం కూడా) దాన్ని వ్యాపారం అంటారు. అందుకే పెద్దలు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలీకూడదు అంటారు. మనం చేసిన మంచి కనపడేటప్పుడు మనం కనపడనవలసిన అవసరం లేదు అని చెప్తోంది ఈ సామెత.
  3. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.

    దయగల వాడు ఐతే పెళ్ళాన్ని కొట్టకుండా వుండాలి కాని, ఎవరకీ తెలియకుండా జాగ్రత్త పడటం ఏంటి!
    కొంతమంది ఇలాగే నలుగురి ముందూ మంచిగా ఉండాలి ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళను గూర్చి చెప్పే సామెత ఇది.
  1. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు

    వరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతి సారి చెయ్యరని చెప్పేదే ఈ సామెత.
  2. అంగట్లో అన్నీ ఉన్నా  అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.

    సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు. కాని ఎన్ని చేసినా ఏదో ఒక కారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు.
    ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
  3. అక్కరకు వచ్చినవాడే మనవాడు.

    అక్కర అంటే అవసరం. మనకు అవసరం ఉన్నప్పుడు, ఆపద సమయాలలో సహాయపడిన వారే మన ఆప్తులు అవుతారు. అంతే కానీ, అవసరమైనప్పుడు సహాయపడని బంధువులు ఉన్ననూ వ్యర్ధమని, మనవారు కాలేరని ఈ సామెత అర్థం.
  1. పేరు గొప్ప ఊరు దిబ్బ.

    ఉదాహరణకి కొన్ని దుకాణాలకు సురుచి అని, రుచి అని ప్రసిద్ధమైన వంటకాల రుచులకు ప్రసిద్ధి అని వాటి గొప్పదనాన్ని చాటుకునేలా బోర్డులు తగిలిస్తారు. విపరీతమైన ప్రచారం సాగిస్తారు. అది నమ్మి ఆ హోటల్‍కు వెళ్తే.. అక్కడి వంటకాలు రుచి చూస్తే ఆశించిన స్థాయిలో ఉండవు. అటువంటి సందర్భంలో నిట్టూరుస్తూ మనసులో అనుకునే మాటే ఇది. పేరు చూసి నమ్మి మోసపోయాం.. ఇంకెప్పుడూ ఆ హోటల్‍కు వెళ్లకూడదు అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
  2. తూర్పుకు తిరిగి దండం పెట్టు!

    ఎవరికన్నా ఎదన్నా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషి తిరిగి మళ్ళీ మనది మనకి ఇవ్వలేని పరిస్తితి వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడతారు.
    సరే తూర్పుకే ఎందుకు తిరిగి దండం పెట్టాలి? వేరే దిక్కులు లేవా అంటే!!! తూర్పుని మనం పుణ్యమైన దిక్కుగా అభివర్ణిస్తాం. ఇంద్రుడు దానికి అధిపతి. సూర్యుడు కూడా తూర్పు నుండే ఉదయిస్తాడు. అందుకే ఇళ్ళల్లో కూడా ఎదన్నా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా తూర్పు ముఖంగా కూర్చోమని అంటారు. కనుక తూర్పుకి తిరిగి దండం పెడితే, ఇక నీ పోయిన సంపద వల్ల కనీసం నీకు పుణ్యం అయినా దక్కుతుంది అని అలా సరదాగా అంటారు.
  3. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట

    ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు.
    పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసిందే!
  1. పొరుగింటి పుల్ల కూర రుచి!

    పొన్నగంటి కూర, చుక్క కూరలను పుల్ల కూరలంటారు. పులుపు చాలామందికి పడదు కారణం దగ్గును తెస్తుంది కనుక. ఆలాంటి పుల్ల కూరలు కూడ పక్కింటి వాళ్ళు చేస్తే రుచికరంగా ఉంటాయి. ఇంట్లో భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత రుచికరంగా వంట చేసినా, వంకలు పెడుతూ పొరుగు లేదా పరాయి స్త్రీల పట్ల వ్యామోహం పెంచుకొని శరీర ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని మర్మ గర్భంగా మనకి చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ఇంటి ఇల్లాలిని విమర్శించడానికి పుట్టిన సామెత ఇది.
  2. తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట!

    నేను ఉదారవాదిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, చేతినిండా ధాన్యం తీసుకురండి అన్నాడట ఒక రాజు. వారి ఉదారత అంతా ఆ గుప్పెడు ధాన్యం పంచటంలోనే ఉందన్నట్టు!!
    మాటలు కోటలు దాటటం లాంటిదే ఇదీనూ. కొందరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు, కాని అసలు చేసేది శూన్యం.
  1. తాటి చెట్టుఅంటే ఎందుకు ఎక్కావురా దూడ గడ్డి కొరకు అన్నాడట!

    అబద్ధం చెపితే అతికినట్టుండాలి. అలా చేత కాని వారికి ఈ సామెత వాడతారు.
  2. ముందొచ్చిన చెవులకన్నా వెనక వచ్చిన కొమ్ములే వాడి.

    ఇది చాలా విషయాల్లో మనం వినేదే!
    ఏ మనిషైనా ముందు నుంచి తన జీవితంలో ఉన్నవారికంటే కొత్తగా వచ్చిన వారికీ కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఈ సామెత వాడతారు!
  1. నిండా మునిగిన వాడికి చలేంటి!

    చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. అలాగే కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.
  2. రాజ్యాలు పోయినా కిరీటాలు వదలేదని ని

    పరిస్థితులు ఇంతకముందులా విలాసవంతంగా బతికినట్టు లేకపొయినా, తాము మాత్రం అలాగే బతకాలి అనుకుంటారు కొంతమంది. ఎక్కడా “తగ్గేదే లే” అన్నట్టు. అది వారి ఇష్టానికి సంబంధించినది అయినప్పటికీ, అలాంటి వారిని గూర్చి హాస్యం గా చెప్తుంది ఈ సామెత.
  3. అంతా తెలిసినవాడూ లేడు ఏమీ తెలియనివాడూ లేడు!

    మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.
  4. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు!

    దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమీ అనలేక దుత్తని పగులగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది.
    ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు.
  5. ఆలస్యం అమృతం విషం!

    క్షీరసాగర మథనం నుంచి పుట్టిన సామెత ఇది.
    క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండలోను మహాభారతంలోని ఆది పర్వములో కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలలో కూడా చెప్పబడింది.
    దేవ దానవులు పాలసముద్రాన్ని చిలకసాగారు. అమృతం పుట్టింది. దాన్ని వారందరికీ పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. ముందు దేవతలకు పంచసాగాడు. తమకూ ఇవ్వమని వచ్చిన దానవులను కాసేపు ఆగమని చెబుతూ వచ్చాడు. చివరికి అమృతమంతా అయిపోయింది. దానవులకు లేకుండా పోయింది. ఆ విషయంపై పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడొక దానవుడు, అమృతం ముందే తీసేసుకోవాల్సింది, అనవసరంగా ఆలస్యం చేశాం, మన ఆలస్యం వల్ల అమృతం పోయి విషం (యుద్ధం) దక్కింది అన్నాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఆలస్యం చేస్తే అనుకున్న మంచి ఫలితం దక్కకపోగా చెడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో దీన్ని వాడతారు.
  6. అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది

    నిజాయితీగా మంచి పద్ధతిలో సంపాదించిన ధనము నిలకడగా మనదగ్గరే ఉండి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా అన్యాయంగా ఆర్జించిన సొమ్ము మన దగ్గర నిలబడక, వృధాగా ఖర్చు అయి కనిపించకుండా పోతుంది. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం

Birthday Wishes in Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి
Sad Quotes in Telugu
Manchi Matalu in Telugu | మంచి మాటలు
Good Morning Wishes in Telugu
Rakhi Wishes in Telugu for Sister

The post Samethalu in Telugu 100+ | తెలుగు సామెతలు తెలుసుకోండి. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-proverbs/samethalu-telugu/feed/ 0
Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/#respond Fri, 26 May 2023 21:45:16 +0000 https://teluguprapamcham.com/?p=4463 పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.

The post Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>

పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.

Greet your loved once happy birthday wishes in telugu with our quotesx

Birthday wishes For Mom in Telugu

  1. అమ్మా నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ

పుట్టినరోజు శుభాకాంక్షలు.


Birthday wishes For Brother in Telugu

  1. జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను . అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నగారికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy birthday in telugu

Birthday wishes for Friends in telugu

  1. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  2. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను చేరాలని.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. కోటి చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నువ్వు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త సంతోషాలు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Birthday wishes for Son In Telugu

  1. చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు సంతోష పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
  2. నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను ఉన్నాను అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
  3. నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరిచిపోలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.

Birthday wishes for Sister in telugu

  1. నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  2. నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందు నువ్వే ఉంటావు అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నేను చిన్నప్పుడు గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.

Birthday Wishes for Brother in telugu

  1. ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
  2. తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నిన్ను మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
  3. నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

Also Read
Sankranti Wishes Telugu
Interesting Samethalu in Telugu
Love Quotes in Telugu

The post Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/feed/ 0